Sunday, 6 November 2011


స్త్రీలు జుట్టు విరబోసుకోరాదంటారు ఎందుకు?





జుట్టు విరబోసుకుని తిరగడం నేడు ఓ ఫ్యాషన్ అయిపోయింది. అయితే మన ఆచార, సాంప్రదాయాల ప్రకారం జుట్టు విరబోసుకోకూడదు. జుట్టు ముడివేసుకుని సువాసన గల పూలు ధరించడం పుని స్త్రీల ఆచారం. పువ్వులకు సుమనస్సులు అని పేరు. వాటి సువాసన వలన మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. 

అసలు వెంట్రుకలు, గోళ్లు మన పాపాలకు ప్రతీకలు. అందుకే శ్రీ వేంకటేశ్వర స్వామికి తల నీలాలిచ్చి పాప ప్రక్షాళన చేసుకుంటాం. సహజంగా స్త్రీలలో ఏదేని విషయం పట్ల పట్టుదల పెరిగితే జుట్టు ముడి వేసుకోమని పట్టుపడతారు. ద్రౌపది, దుశ్శాసనుడు తన జుట్టుపట్టుకు గుంజాడన్న రోషంతో ద్రౌపది ఆనాడు జుట్టు విరబోసుకుంది. కనుక అట్టి కార్యాన్ని రోజువారి చేయకూడదంటోంది శాస్త్రం.

గంగానది పుణ్య నదులలో స్నానం చేసే ముందు స్త్రీలు, పురుషులు తమ జుట్టు, గోళ్లు తీయించుకుని నీళ్లలో పడవేయడం, తండ్రి తాతలు మరణిస్తే జుట్టు తీయించుకోవడం మొదలైన ఆచారాల ఆంతర్యమిదేనంటారు.


పెళ్లిలో వధువు కాలి బొటన వ్రేలు తొక్కిస్తారెందుకు...?




మన శరీరాలు నరాల పుట్టలు. ఈ నరాల ద్వారా విద్యుత్తు ప్రవహిస్తుంటుంది. ఋణ, ధన విద్యుత్తున్న భాగంతో విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. పాజిటివ్ మరియు నెగిటివ్ విద్యుత్తులు రెండూ కలిస్తేనే విద్యుత్తు పుడుతుంది కదా. అంటే అక్కడితో విద్యుత్ ప్రవాహం ఆగిపోతుందన్నమాట. 

వరుడు కుడికాలి బొటనవ్రేలితో వధువు బొటనవ్రేలిని తొక్కిస్తే వారిద్దరిలో ప్రవహించే విద్యుత్తు కలిసి ఇద్దరూ ఒకటవుతారు. ఒకరి తలపై ఒకరు జీలకర్ర పెట్టించడం, ఏడడుగులు నడవడం... ఇత్యాది ప్రక్రియలన్నీ ఇద్దరినీ కలిపి ఒకటిగా చేయడం కోసమే. 

అందుకే పైకి వారిద్దరుగా కనబడుతున్నా.... మానసికంగా, ఆలోచనాపరంగా ఒక్కటే. లెక్కల్లో 1+1=2. కానీ భార్యాభర్తల లెక్కల్లో 1+1=1. అప్పుడే ఆదర్శవంతమైన జంటగా ఉంటారు.

కుటుంబ సంక్షేమం... స్త్రీ నుదుటి సిందూరం




కనుబొమల నడుమ ఎర్రని బొట్టు పెట్టుకోవడం హైందవ సంప్రదాయం. ఇంటికి వచ్చిన ఏ ముత్తయిదువకైనా బొట్టుపెట్టి పంపడం మన ఆచారం. పాపిడ నడుమ ధరించే ఈ సిందూరం పెళ్లయిందని చప్పడానికి ప్రధాన సూచిక. మేష భగవానుడు అంగారకుడు. అతని రంగు ఎరుపు. ఇది చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. అందువల్లనే ఎర్రని సిందూరాన్ని నుదుటిపైన, పాపిట మధ్యలో ధరిస్తారు. 

ఈ రెండూ సౌభాగ్య చిహ్నాలే. పార్వతి, సతీల స్త్రీ శక్తి చిహ్నంగా కూడా సిందూరాన్ని పరిగణిస్తారు. ఎర్రటి రంగు ఆమె ప్రవేశంతో సంపద చేకూర్చుతుందనీ, స్త్రీ ధరించే సిందూరం కుటుంబ సంక్షేమాన్ని, సంతానాన్ని పరిరక్షిస్తుందని విశ్వాసం.

పురుషులు కూడా నుదుట తిలకం ధరించే సంప్రదాయం ఉంది. ఏదైనా మత సంబంధిత కార్యక్రమాలకు, పెళ్లిళ్లవంటి శుభకార్యాలలో ఈ విధంగా తిలకం ధరిస్తారు. మత సంబంధిత సందర్భాలలో వారు తమ కొలిచే దైవాన్ని అనసరించి తిలకం ఆకృతి ఉంటుంది. 

విష్ణు భక్తులు "U" ఆకృతిలో తిలకం పెట్టుకుంటే, శైవ భక్తులు మూడు అడ్డగీతలతో దిద్దుకుంటారు. బొట్టు పెట్టుకునే చోట అగ్యచక్ర లేదా ఆధ్యాత్మిక లేదా మూడో నేత్రం ఉంటుందని చెపుతారు. ఇది ప్రధాన నాడీ కేంద్రం. అనుభవాలన్నీ కలగలిపి ఒకేచోట కేంద్రీకరించే బిందువు ఇది. 

ఈ ప్రదేశానికి చల్లని ప్రభావం ఉంటుంది. బొట్టు ఆధ్యాత్మిక సౌకర్యాన్ని చేకూర్చి పెట్టడమే కాకుండా దురదృష్టం, దుష్ట శక్తులు దరిచేరకుండా సంరక్షిస్తుందని విశ్వాసం.


తెలుగు సంవత్సరములు


తెలుగు సంవత్సరములు 60.

1. ప్రభవ…………..1987-88
 2. విభవ………………88-89
 3. శుక్ల………………..89-90
 4. ప్రమోదూత……….90-91
 5. ప్రజోత్పత్తి………….91-92
 6. అంగీరస……………92-93
 7. శ్రీముఖ…………….93-94
 8. భావ………………..94-95
 9. యువ………………95-96
10. ధాత……………….96-97
11. ఈశ్వర……………..97-98
12. బహుధాన్య……….98-99
13. ప్రమాది…………….99-2000
14. విక్రమ………….2000-01
15. వృష…………………01-02
16. చిత్రభాను…………..02-03
17. స్వభాను……………03-04
18. తారణ………………04-05
19. పార్ధివ……………….05-06
20. వ్యయ……………….06-07
21. సర్వజిత్తు……………07-08
22. సర్వధారి……………08-09
23. విరోధి………………..09-10
24. వికృతి………………..10-11
25. ఖర……………………11-12
26. నందన……………….12-13
27. విజయ……………….13-14
28. జయ………………….14-15
29. మన్మధ……………….15-16
30. దుర్ముఖి……………..16-17
31. హేవిళంబి……………..17-18
32. విళంబి…………………18-19
33. వికారి…………………..19-20
34. శార్వరి………………….20-21
35. ప్రవ………………………21-22
36. శుభకృతు………………22-23
37. శోభకృతు………………..23-24
38. క్రోధీ……………………….24-25
39. విశ్వావసు……………….25-26
40. పరాభవ………………….26-27
41. ప్రవంగ…………………….27-28
42. కీలక………………………28-29
43. సౌమ్య…………………….29-30
44. సాధారణ………………….30-31
45. విరోధికృతు……………….31-32
46. పరీధావి……………………32-33
47. ప్రమాదీచ………………….33-34
48. ఆనంద…………………….34-35
49. రాక్షస………………………35-36
50. నల…………………………36-37
51. పింగళ………………………37-38
52. కాలయుక్తి…………………38-39
53. సిధార్థ………………………39-40
54. రౌద్రి…………………………40-41
55. దుర్మతి……………………..41-42
56. దుందుభి……………………42-43
57. రుధిరోద్గారి…………………..43-44
58. రక్తాక్షి…………………………44-45
59. క్రోధన…………………………45-46
60. అక్షయ……………………….46-47




మన తెలుగును కాపాడుకోవడమెలా?


భాషను కాపాడుకోవడం, భాషలో అభివ్యక్తి నైపుణ్యాలు పెంచుకోవడం, భాషను బోధనభాషగా, పరిపాలనా భాషగా మార్చుకోవడం వంటివి ఈ కాలంలో సాధ్యమయ్యే అంశాలేనా? ఎవరో ఒకరు వీటిని పట్టించుకోకపోతే ముందుతరాలకు ఈ సంస్కృతి, సాహిత్యం అందేదెలా? ప్రతి కాలంలోనూ ఈ అంశాలపై చర్చ జరుగుతూనే ఉంటుంది. గిడుగు పిడుగులా గ్రాంధిక భాషావాదులపై విరుచుకుపడితేనే వ్యావహారిక భాషోద్యమం వచ్చింది. దాని ఫలాలే మనం అనుభవిస్తున్నాం. భాష ఆయా కాలాల్లో, ఆయా ప్రజల కాంక్షలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ అంశాలపై తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు డా. వెలిచాల కొండలరావు ఇటీవల ఎంతో కృషిచేశారు. ఈ అంశాలపై అందర్నీ చైతన్యపరచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూడు అంశాలపై ఆయన మనోభావాలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 
తెలుగును కాపాడుకోవడం ఎలా? 
ఏ భాష అయినా ఆ భాష మాట్లాడేవారికి ఒక సంస్కారాన్ని, ఒక సంస్కృతిని, వాటికి సంబంధించిన విలువలను అందిస్తుంది. ఆ విలువలు, విశ్వాసాలు మఖలో పుట్టి పుబ్బలో పతనమయ్యేవికావు. అవి ఆ ప్రజల నరనరాల్లో జీర్ణించుకొని ఉంటాయి. భాష అనేది ఒక జాతి వ్యక్తిత్వానికి, అస్తిత్వానికి ప్రతినిధిగానే ఉంటుంది. అది నిత్యస్రవంతి. ఎప్పటికప్పుడు అత్యంత ఆధునికంగా మారే గుణం కూడా దానికి ఉంటుంది. అందువల్ల మన భాషను మనం కాపాడుకుంటూనే ఇంగ్లిషు వంటి భాషల్ని నేర్చుకోవాలేకానీ, మన భాషని విస్మరించి కాదు. మన భాషను మనం మాట్లాడలేకపోతే, దానిలో అభిప్రాయాలు వ్యక్తీకరించలేకపోతే అంతకన్నా నష్టం మరొకటి లేదు. ఏ పరాయి భాషనైనా నేర్చుకొని అందులో అందరూ మెచ్చేలా వ్యక్తీకరించేవారు తమ భాషపై కూడా వారు పట్టు సాధించే ఉంటారన్న వాస్తవాల్ని గ్రహించాలి. ఇంగ్లిషు భాషని మనం ఎంతగా నేర్చుకున్నా, ఇంగ్లిషు భాష మాతృభాషగా ఉన్నవారు మాట్లాడినట్లు మాట్లాడ్డం, వాళ్ళు రాసినట్లు రాయడం, అతికొద్ది మందికి తప్ప అందరికీ సాధ్యంకాదు. ఈ దేశంలో రెండు విధాలైన ఛాందస వాదులున్నారు. కేవలం ఇంగ్లిషు మాత్రమే కావాలనే వారు, లేదా తెలుగు మాత్రమే కావాలనేవారు. రెండు వర్గాల వాదనలూ అప్రస్తుతమే. ఆ వాదాలు అసమంజసం. ఈ కాలానికి విరుద్ధం ఇంగ్లిషు భాష బతుకు తెరువుకోసం ఎంతైనా అవసరమే. అలాగే మన భాష, సంస్కృతి, ఆత్మగౌరవం, దేశీయత, ఆత్మ విశ్వాసం, వ్యక్తిత్వం నిలవాలంటే తెలుగు కూడా ఉండాల్సిందే. అందువల్ల- 
* తెలుగుకు ఇంగ్లీషుకు సమానస్థాయి కల్పించాలి. 
* చిన్న తరగతుల్లో తెలుగు ద్వారా ఇంగ్లిషు నేర్చుకొనే విధానాన్ని ప్రోత్సహించాలి. 
* ఉభయ భాషా ప్రవీణులను తయారుచేసేలా కోర్సులు రూపొందించాలి. 
* ఇతర రాష్ట్రాల్లో అమలుచేస్తున్నట్లు తెలుగు మీడియంలో చదివిన వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ సదుపాయాలు కల్పించాలి. 
బోధనభాష X పరిపాలనా భాష 
ఏ భాషకైనా పరిపాలనా భాషగా అమలుచేయాలంటే ఆ భాష మామూలు భాషగానే కాక సకల వ్యవహారాలకు ఉపయోగపడే భాషగా కూడా ఉండాలి. అంటే 'పరిభాష' అన్నమాట. ఇంకా విపులంగా చెప్పుకోవాలంటే ఆ భాష అన్నిరంగాలకు, వృత్తులకు, విషయాలకు, పనులకు వర్తించే భాషగా ఉండాలి. 
* మామూలు భాష అంటే అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, విద్యాధికులు కానివారు కూడా మాట్లాడగలిగేది, అర్థం చేసుకోగలిగేది అన్నమాట. 
* పరిభాష అంటే- చాలావరకు విద్యల ద్వారా, విద్యాలయాల ద్వారా నేర్చుకోవలసిన భాష. ఇంకా అనేక శాస్త్రాలు, చట్టాలు అన్నీ ఇంగ్లిషులోనే ఉన్నాయన్నది వాస్తవం. 
* తెలుగుభాష ప్రస్తుతం పరిపాలనా భాషగా మారాలంటే ముందు దాన్ని అన్ని అవసరాలకు వాడుకోవాలి. కానీ చిత్రమేమిటంటే ఇప్పటికీ తెలుగును ఉన్నతావసరాలకు వాడడంలేదు. ప్రభుత్వం తన సంప్రదింపులు, కార్యకలాపాలన్నీ ఇంగ్లిషులోనే సాగిస్తోంది. న్యాయవస్థ సైతం ఇంగ్లిషునే వాడుతోంది- ఇది కొన్ని ఉదాహరణలు మాత్రమే. 
* తెలుగు పరిపాలన భాష అయితేనే కానీ బోధన భాషగా ఆదరణ పొందలేదు. బోధన భాష అయితేనే కానీ పరిపాలన భాష కాలేదు. రెండూ పరస్పరం ఒకదానిమీద మరొకటి ఆధారపడి ఉన్నాయి. తెలుగు బోధనభాష అయితేనే తప్ప పరిపాలనా భాష కాలేదు. 
* మన రాష్ట్రాన్ని భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పరచుకొన్నపుడే తెలుగు ఈ రాష్ట్రానికి పాలన భాష, బోధనభాష అవుతుందని ఆశించాం. కానీ ఇన్నేళ్లు గడచిపోయినా ఆ దిశగా సాధించింది మాత్రం చాలా స్వల్పం. 
* ఇంగ్లిషు భాష రాకపోతే అభివృద్ధి లేదనేవారు కొన్ని విషయాలు గుర్తించాలి. జపాన్‌, చైనా, ఫ్రాన్స్‌, రష్యా, జర్మనీ, కొరియా... ఈ దేశాలన్నీ ఇప్పటికీ తమ మాతృ భాషల్లోనే బోధన, పాలన సాగిస్తున్నాయి. మరి అవి అభివృద్ధి చెందలేదనగలమా? 
* ఇంగ్లిషు భాష నేర్చుకోకపోతే విదేశాల్లో ఉద్యోగాలు దొరకవనడానికి విదేశాల్లో ఉద్యోగాలు పొందుతున్న వారి శాతం ఎంత? సగటు ఉద్యోగాల్లో స్వల్పశాతమే! మరి ఇంగ్లిషు పట్ల మక్కువ, సొంత భాషపట్ల తిరస్కారం దేనికి? 
* దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో వారు వారి భాషల పట్ల చూపుతున్న మక్కువ, దీక్ష, అంకితభావం మనలో ఎందుకు కొరవడ్డాయి? ఇది తక్షణం ఆలోచించాల్సిన విషయం. అంతేకాదు సరిదిద్దుకోవలసినది కూడా. 
* అభివృద్ధి కౌశలాలు (కమ్యూనికేషన్‌ స్కిల్స్‌) అనగానే ఇంగ్లిషు భాషలో మాట్లాడ్డం వంటివేనా? తెలుగులో మాట్లాడ్డం, రాయడం, ప్రదర్శించడం అవసరంలేదా? 
* తెలుగును బోధన భాషగా, పరిపాలనా భాషగా చేయడానికి ప్రభుత్వంతోపాటు అన్ని సంస్థలు, మేధావులు కంకణం కట్టుకోవాలి. 
భాషా సాహిత్యాలు, అభివ్యక్తి నైపుణ్యాలు 
కమ్యూనికేషన్‌ స్కిల్‌ అనేది తెలుగులో కూడా అవసరం అన్నది అందరూ గుర్తించాలి. తెలుగు భాష, దాని స్వరూపం, వ్యాకరణం, ఛందస్సు వంటివి తెలిసి, తెలుగులో సుప్రసిద్ధుల రచనలు చదివినపుడు తప్పక కౌశలం కలుగుతుంది. అప్పుడే భాషను సవ్యంగా వాడడం అలవడుతుంది. అంతేకానీ భాషలో మాట్లాడగలిగేంత పరిజ్ఞానం మాత్రమే ఉంటే అభివ్యక్తి నైపుణ్యం కలగదు. ఈ రోజు వివిధ మీడియాల్లో ఉన్నవారు పైపై మాటలతో పబ్బం గడుపుకొంటున్నా దీర్ఘకాలం వారు అందులో రాణించలేరు. అంటే భాషానైపుణ్యం సాధించాలనుకొనేవారు 'సాహిత్యభాష'ను అలవరుచుకోవాలి. సాహిత్యభాష అంటే అలంకారాలు, ఉపమానాలు, ఉత్ప్రేక్షలు, సాహిత్యంలోంచి సూక్తులు, పద్య, గేయ భాగాలు, సామెతలు, పలుకుబడులు, ప్రతీకలు, నానుడులు వంటివి ఉదహరించగల శక్తియుక్తులు కలిగించే భాష. ఆ శక్తి యుక్తులున్నవారే తమ మాటలు, ఉపన్యాసాలు, వ్యాఖ్యానాల ద్వారా ప్రజల్ని ఆకట్టుకోగలరు.

Friday, 4 November 2011

మన సంక్రాంతి !!!!!!!!!


ముందుగా బ్లాగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి క్రొత్త సంవతరంలో వచ్చే మొదటి పండగ, మన తెలుగు వాళ్ళందరికి చాలా పెద్ద పండగ మరియు ముఖ్యమైన పండగ. ఎందుకంటే మన చేలోని ధాన్యం కోత కొయ్యబడి రాసులు గా మన ఇంటికి చేరాక వచ్చే పండగ. అందుకే మన తెలుగు వారందరికి ఇది చాలా ముఖ్య పండగ. ఇది ఒక్క రోజు పండగ కాదు మూడు రోజుల పండగ.


ఈ పండగ మొదటిరోజు ఇంటిల్లిపాది తెల్లవారుజామునే లేచి భొగి మంటల ముందు కూర్చుని ఆ వెచ్చని మంటల వేడిని కాచుకుంటూ ఆ మంట మీద పరవాణ్ణం పెట్టి అది దేవుడికి నైవేధ్యం కింద సమర్పించి తరువాత దానిని ఆరగిస్తరు. తరువాత కమ్మని పిండి వంటలు చేసుకొని విందు ఆరగిస్తారు. సంక్రాంతి అంటే మనకు బాగా గుర్తు వచ్చేది కొత్త అళ్ళుళ్ళ రాకలు, బావా మరదళ్ళ సరదాలు మరియు ముఖ్యంగా చెప్పుకోవలసింది కొడి పందాలు.ఇక్కడ చెప్పుకోవలసినది ఇంకొకటి వుంది ముగ్గుల లోగిళ్ళు. ఆడవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటి ముందు వాకిలిని రకరకాల ముగ్గులతో, వాటి మధ్యలో చిన్న చిన్న గొబ్బెమ్మలతో అలంకరించేవారు.పల్లెటూళ్ళలో ఇతే పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి వాటికి రకరకాల రంగులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి అలంకరించేవారు. అది చూడటానికి చాలా ముచ్చటగా ఉండేది.


ఇక్కడ చెప్పుకోవలసినది ఇంకొకటి ఉంది అదే హరి దాసు మరియు గంగిరెద్దు. పండగ మొదటి రోజు ఉదయాన్నే హరిదాసు చిడతలతో రోజు మొదలవుతుంది. కాని ఇప్పుడు అవేమి కనబడడం లేదు కారణం గ్లోబలైజేసన్. దీని పుణ్యమా అని అందరూ పట్టణాలకి వలస రావడంవల్ల పల్లేటూళ్ళు ఖాళి ఇయిపొయి కనీసం పండగలకు కూడ మన సొంత గ్రామము వెళ్ళే తీరిక కూడ లేకుండా పొయింది. ఒక వేళ వెళ్ళాలనుకున్నా రకరకాల ఇబ్బందులు అందులో కొన్ని మచ్చుతునకలు :


1) టికెట్స్ ఏక్కువ ధరకి అమ్మడం.




2) కార్యాలయములో సెలవు దొరకకపొవడం.




3) ప్రణాలిక లేకపొవడం.




4) అన్నీ ఉన్నా వెళ్ళడం ఇష్టం లేక పొవడం.


కాని ఇప్పుడిప్పుడే మనలో మార్పు వస్తుంది సంక్రాంతి వచ్చిందంటే చాలా మంది ఈ కాంక్రీట్ జంగిల్ నుంచి, ఈ కాలుష్యం నుంచి బైట పడాలని చూస్తున్నారు. మన చిన్నప్పుడు సంక్రాంతి వచ్చిందంటే పండగే ఏందుకంటే ఆ పండుగకే భంధుగణమంతా కలిసేది. కాని ఇప్పుడు ఎవరు కలవడం లేదు ఎవరికి వారు ఉన్నత విద్యలని, ఉద్యోగాలని విదేశాలకు వెల్లిపోతున్నారు. వెళ్ళిన వారు రావడానికి కనీసం నాలుగైదు సంవత్సరములు పడుతుంది. ఇలా మనం జీవితంలో ఎదగడానికి పడే తాపత్రయంలో మనం ఏమి కోల్పోతున్నామో తెలియడం లేదు. ఇది మన ధౌర్భాగ్యం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు సంక్రాంతి వస్తుందంటే సెలవు కోసం చూస్తున్నాం అంతే!!!!!!


ఇక రెండవ రోజుకి వస్తే అదే అసలు పండగ పైగా పెద్ద పండగ దాన్నే మకర సంక్రాంతి అని అంటారు. ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానము చేసి గుడికి వెళ్ళి ఏమైనా పిండి వంటలు చేసుకొని విందు ఆరగించి అలా సర్దాగా చేలలో తిరిగితిరిగి కోడి పందాల దగ్గరకి వెళ్ళి ఇంటికి వచ్చి ఆ అలసటకు నిద్రలోకి జారుకుంటారు.ఆ రోజు అంతా కోడి పందాలదే హవా.
ఇక మూడవ రోజు అదే చివరి రోజు దాన్నే కనుమ అంటారు.ఆ రోజు పెద్దగా విషయం లేకపొయినా హాడావిడి మాత్రం ఏ మాత్రం తగ్గదు. కాని చివరి రోజు కావడం వల్ల ఎవరికి వారు ప్రయాణానికి సిద్దం కావలసిందే. వచ్చేటప్పుడు ఏంత సంతోషంగా వస్తామో వెళ్ళేటప్పుడు అంత బాధగా వెళ్తాము.


మళ్ళా మొదలు ఉరుకులు పరుగుల నగర జీవనం.....